మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Dattatreya Ashtottara Shatanama Stotram 2 – శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం


ఓంకారతత్త్వరూపాయ దివ్యజ్ఞానాత్మనే నమః |
నభోఽతీతమహాధామ్నే ఐంద్ర్యర్ధ్యా ఓజసే నమః || 1 ||

నష్టమత్సరగమ్యాయాఽఽగమ్యాచారాత్మవర్త్మనే |
మోచితామేధ్యకృతయే హ్రీంబీజశ్రాణితశ్రితః || 2 ||

మోహాదివిభ్రమాంతాయ బహుకాయధరాయ చ |
భక్తదుర్వైభవచ్ఛేత్రే క్లీంబీజవరజాపినే || 3 ||

భవహేతువినాశాయ రాజచ్ఛోణాధరాయ చ |
గతిప్రకంపితాండాయ చారువ్యాయతబాహవే || 4 ||

గతగర్వప్రియాయాస్తు యమాదియతచేతసే |
వశితాజాతవశ్యాయ ముండినే అనసూయవే || 5 ||

వదద్వరేణ్యవాగ్జాలావిస్పష్టవివిధాత్మనే |
తపోధనప్రసన్నాయేడాపతిస్తుతకీర్తయే || 6 ||

తేజోమణ్యంతరంగాయాద్మరసద్మవిహాపినే |
ఆంతరస్థానసంస్థాయాయైశ్వర్యశ్రౌతగీతయే || 7 ||

వాతాదిభయయుగ్భావహేతవే హేతుహేతవే |
జగదాత్మాత్మభూతాయ విద్విషత్షట్కఘాతినే || 8 ||

సురవర్గోద్ధృతే భూత్యా అసురావాసభేదినే |
నేత్రే చ నయనాక్ష్ణే చిచ్చేతనాయ మహాత్మనే || 9 ||

దేవాధిదేవదేవాయ వసుధాసురపాలినే |
యాజినామగ్రగణ్యాయ ద్రాంబీజజపతుష్టయే || 10 ||

వాసనావనదావాయ ధూలియుగ్దేహమాలినే |
యతిసంన్యాసిగతయే దత్తాత్రేయేతి సంవిదే || 11 ||

యజనాస్యభుజేఽజాయ తారకావాసగామినే |
మహాజవాస్పృగ్రూపాయాత్తాకారాయ విరూపిణే || 12 ||

నరాయ ధీప్రదీపాయ యశస్వియశసే నమః |
హారిణే చోజ్జ్వలాంగాయాత్రేస్తనూజాయ శంభవే || 13 ||

మోచితామరసంఘాయ ధీమతాం ధీకరాయ చ |
బలిష్ఠవిప్రలభ్యాయ యాగహోమప్రియాయ చ || 14 ||

భజన్మహిమవిఖ్యాత్రేఽమరారిమహిమచ్ఛిదే |
లాభాయ ముండిపూజ్యాయ యమినే హేమమాలినే || 15 ||

గతోపాధివ్యాధయే చ హిరణ్యాహితకాంతయే |
యతీంద్రచర్యాం దధతే నరభావౌషధాయ చ || 16 ||

వరిష్ఠయోగిపూజ్యాయ తంతుసంతన్వతే నమః |
స్వాత్మగాథాసుతీర్థాయ సుశ్రియే షట్కరాయ చ || 17 ||

తేజోమయోత్తమాంగాయ నోదనానోద్యకర్మణే |
హాన్యాప్తిమృతివిజ్ఞాత్రే ఓంకారితసుభక్తయే || 18 ||

రుక్షుఙ్మనఃఖేదహృతే దర్శనావిషయాత్మనే |
రాంకవాతతవస్త్రాయ నరతత్త్వప్రకాశినే || 19 ||

ద్రావితప్రణతాఘాయాత్తస్వజిష్ణుస్వరాశయే |
రాజత్త్ర్యాస్యైకరూపాయ మస్థాయ మసుబంధవే || 20 ||

యతయే చోదనాతీతప్రచారప్రభవే నమః |
మానరోషవిహీనాయ శిష్యసంసిద్ధికారిణే || 21 ||

గంత్రే పాదవిహీనాయ చోదనాచోదితాత్మనే |
యవీయసేఽలర్కదుఃఖవారిణేఽఖండితాత్మనే || 22 ||

హ్రీంబీజాయార్జునేష్ఠాయ దర్శనాదర్శితాత్మనే |
నతిసంతుష్టచిత్తాయ యతయే బ్రహ్మచారిణే || 23 ||

ఇత్యేష సత్ స్తవో వృత్తోఽయాత్కం దేయాత్ప్రజాపినే |
మస్కరీశో మనుస్యూతః పరబ్రహ్మపదప్రదః || 24 ||

ఇతి శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.